Sampangi Remma Poobanti vamma, Telugu

Sampangi remma poobanti telugu lyrics- from Sampangi Lyrics - Unni Krishnan


Sampangi remma poobanti telugu lyrics- from sampangi
Singer Unni Krishnan
Composer Ghantadi Krishna
Music Adithya Music
Song WriterVarikuppala Yadagiri

Lyrics

సంపంగి రెమ్మ పూబంతివమ్మ

నచ్చావే గుమ్మా అందాల బొమ్మ


ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

ఆ నవ్వుల్లోన ఉన్న ఎన్నో అర్థాలోయమ్మ

సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా

నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుంది

ఓ నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోంది

పరిసరి పాసనిస నినిపమరిస రిపమప

మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ

ఎదను తాకగానే ఎదో హాయి రగిలెనే

చాటుమాటుగా నిన్నే నే చుస్తున్నానే

గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే

ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే


సంపంగి రెమ్మ పూబంతివమ్మ

సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా


రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ

కలలో నిన్నే చూసి మురిసిపోతానే

ఆ ఆ ఆఆ ఉదయమే అయినా మేల్కొన్న మనసు పడనిదే

ఓ కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని

ఏకాంతాన నీ ఊహలో జీవిస్తానే

ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే

నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా


సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా

అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా




Sampangi remma poobanti telugu lyrics- from sampangi Watch Video

Comments